Thursday, May 16, 2024

హేమంత్ హత్య కేసులో 13 మంది అరెస్టు: డిసిపి

- Advertisement -
- Advertisement -

13 Members arrest in Hemanth murder case

 

హైదరాబాద్: హేమంత్ హత్య కేసులో ఇప్పటి వరకు 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. పరువు హత్య కేసులో అవంతి బంధువులే పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ హత్యలో ప్రధాన సూత్రదారులుగా లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోస్ రెడ్డి, స్పందన, స్వప్న, అర్చన ఉన్నట్టు గుర్తించామన్నారు. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు మినహా బయట వ్యక్తులకు ఈ హత్యకు సంబంధం లేదన్నారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డి తన బంధువులతో  కలిసి మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చి మాట్లాడుదామని కార్లలో చందానగర్ వైపుకు తీసుకెళ్లారు. ఆ దంపతులకు అనుమానం కలగడంతో కారు నుంచి దూకి పారిపోతుండగా యుగంధర్ రెడ్డి హేమంత్ ను పట్టుకున్నాడు. అవంతి వాళ్ల నుంచి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది కానీ అప్పటికే యుగంధర్ రెడ్డి సెల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయడంతో నిందితులను పట్టుకోవడంలో ఆలస్యం జరిగిందన్నారు. ఎక్కడా పోలీసులు వైఫల్యం లేదని డిసిపి తెలిపారు. ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కోపంతో హేమంత్ ను అవంతి కుటుంబ సభ్యులు హత్య చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News