Saturday, May 11, 2024

బెంగళూరు లక్ష్యం 178

- Advertisement -
- Advertisement -

Bangalore target 178 runs

ముంబై: ఐపిఎల్‌ 2021లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ మద్య జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 09  వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రాజస్థాన్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్ లో ఓపెనర్ బట్లర్ (8) బౌల్డయ్యాడు. దీంతో రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ వోహ్రా(7) జెమిసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ సిరాజ్ వేసిన 4వ ఓవర్లో ఎల్బి గా వెనుతిరిగాడు. దీంతో రాజస్థాన్ 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సుందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8 ఓవర్లో సామ్సన్‌(21) మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన పరాగ్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన 14 ఓవర్‌ మూడో బంతికి చహల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను తన బ్యాటింగ్‌తో నిలబెట్టిన శివమ్‌ దూబే(46) కేన్‌ రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  స్వల్ప స్కోరుకే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌ చేరినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌ చెరో మూడు వికెట్లు తీయగా..జేమీసన్‌; రిచర్డ్‌సన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News