Tuesday, May 7, 2024

ఆంక్షలు సడలిస్తేనే ఆడతాం: ఆస్ట్రేలియా బోర్డుకు బిసిసిఐ లేఖ

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: నాలుగో టెస్టు ఆడాలంటే కఠిన క్వారంటైన్ నిబంధనలు సడలించాల్సిందేనని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ నిబంధనలు సడలించక పోతే బ్రిస్బేన్‌లో జరిగే నాలుగు టెస్టులో బరిలోకి దిగే ప్రస్తక్తే లేదని బిసిసిఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు గురువారం లేఖ రాసింది. ఇందులోక్వారంటైన్ నిబంధనలు సడలించాలని సూచించింది. కఠిన నిబంధనల నేపథ్యంలో తమ ఆటగాళ్లు ఈ టెస్టు బరిలో దిగడం చాలా కష్టమని బోర్డు ఆ లేఖలో పేర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే క్వారంటైన్ విషయంలో తమ వైఖరి స్పష్టం చేశామని, ఇలాంటి స్థితిలో కొత్త రూల్స్‌కు ఒప్పుకునే ప్రసక్తే లేదని బిసిసిఐ స్పష్టం చేసింది. ఇప్పటికే తమ క్రికెటర్లు ఆస్ట్రేలియా గడ్డపై కఠిన క్వారంటైన్‌ను పూర్తి విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. అయినా బ్రిస్బేన్‌లో మరోసారి క్వారంటైన్ నిబంధనలు పాటించాలని అక్కడి స్థానిక ప్రభుత్వం కొరడం తమకు సమ్మతం కాదని బిసిసిఐ ఆ లేఖలో పేర్కొంది. ఒకవేళ నిబంధనలు సడలించకపోతే నాలుగో టెస్టులో పాల్గొనకుండానే భారత్ వెళ్లి పోతామని బోర్డు హెచ్చరించింది.

BCCI Letter to Cricket Australia over India’s Restrictions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News