Tuesday, May 7, 2024

దొంగతనం…. కాలితో తన్నాడని… ఖతం చేయబోయాడు…

- Advertisement -
- Advertisement -

Beggar attempt murder in Hyderabad

 

హైదరాబాద్: దొంగతనం చేస్తుండగా అడ్డుగా వచ్చాడని అతడి గొంతును దొంగ చేసిన సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లో హన్మంతు అనే యాచకుడు ఫుట్‌పాత్‌పై మద్యం తాగి నిద్రలోకి జారుకున్నాడు. హసన్ అనే వ్యక్తి హన్మంతు జేబులో ఉన్న డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తుండగా అతడిని హన్మంతు కాలితో గట్టిగా తన్నాడు. దీంతో హసన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గంట తరువాత వచ్చి హన్మంతు గొంతు కోస్తుండగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News