Saturday, April 27, 2024

టిఎంసి ఎంఎల్‌ఎ రాజీనామాను ఆమోదించని బెంగాల్ స్పీకర్

- Advertisement -
- Advertisement -

Bengal Speaker notBengal Speaker not accept resignation of TMC MLA accept resignation of TMC MLA

కోల్‌కత: శాసనసభ నిబంధనలకు అనుగుణంగా లేనందున తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు సువేందు అధికారి రాజీనామాను తాను ఆమోదించలేదని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారం తెలిపారు. సువేందు అధికారి తనకు వ్యక్తిగతంగా రాజీనామా లేఖ అందచేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ రాజీనామా స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా చేసిందీ లేనిదీ కూడా తనకు తెలియదని స్పీకర్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ్యుడు సువేందు అధికారి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా ఈ రాజీనామా చేశారని తాను సంతృప్తి చెందితే తప్ప రాజ్యాంగ నిబంధనలు, శాసనసభా కార్యకలాపాల నియమ నిబంధనలను పురస్కరించుకుని తాను ఈ రాజీనామాను ఆమోదించడం సాధ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. కాగా..మమతా బెనర్జీ క్యాబినెట్‌లో మంత్రి పదవికి రాజీనామా చేసిన సువేందు అధికారి డిసెంబర్ 16న అసెంబ్లీ సచివాలయంలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఆ సమయంలో స్పీకర్ అసెంబ్లీలో లేరు. అయితే.. రాజీనామా విషయం మాట్లాడేందుకు ఈ నెల 21న తన చాంబర్‌లో తనను వ్యక్తిగతంగా కలుసుకోవాలని సువేందును స్పీకర్ బెనర్జీ ఆదేశించారు.

Bengal Speaker not accept resignation of TMC MLA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News