Thursday, May 2, 2024

బాలుడిపైకి దూసుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

The Car crashed into the Boy

 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపైకి రివర్స్‌లో కారు ఢీకొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పాతబస్తీలోని కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీ చోటుచేసుకుంది. నగరంలోని శంషీర్‌గంజ్ ప్రాంతంలో ఓ ఇంటి ఎదుట ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. అదే సమయంలో కారు ఒక్కసారిగా రివర్స్‌గా రావడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన నుంచి ఓ బాలుడు క్షేమంగా బయటపడగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు రాలేదని కాలపత్తర్ పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News