Sunday, April 28, 2024

ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఆర్నాల్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త కాదు. ఫ్రెంచ్ బిలియనీర్, లూయిస్ విట్టన్ మోట్ హెన్నెస్సీ (ఎల్‌విఎంహెచ్) సిఇఒ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆయన్ని అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నారు. టెస్లా షేర్ల పతనం కారణంగా మస్క్ నికర విలువ గణనీయంగా పడిపోయింది. ఫోర్బ్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, ఆర్నాల్ట్ నికర విలువ ఇప్పుడు 207 బిలియన్ డాలర్లు (రూ. 17.20 లక్షల కోట్లు), ఎలాన్ మస్క్ నికర విలువ 204 బిలియన్ డాలర్లు (రూ. 16.96 లక్షల కోట్లు)గా ఉంది.

కాగా జెఫ్ బెజోస్ రూ.15.04 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టాప్10లో భారత్‌కు బిలియనీర్ ఎవరూ లేరు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 104 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.64 లక్షల కోట్లు) సంపదతో 11వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ జాబితాలో గౌతమ్ అదానీ 16వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర విలువ 75 బిలియన్ డాలర్లు (రూ. 6.23 లక్షల కోట్లు)గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News