Monday, April 29, 2024

యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్‌గా భాస్కర్ రావు బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్‌గా ఏ.భాస్కర్ రావు బుధవారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని, బదిలీ అయిన జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి .శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు నూతనంగా బదిలీపై వచ్చిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎ.భాస్కర్ రావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారిగా అమరేందర్ , చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి ఉపేందర్ రెడ్డి, లను అధికారులు నూతనంగా విధులలో చేరిన జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News