Tuesday, May 7, 2024

కరోనా టీకాను నమ్మాలని ప్రజలకు బైడెన్ వినతి

- Advertisement -
- Advertisement -

Biden urges people to trust the corona vaccine

 

వాషింగ్టన్ : ఎలాంటి రాజకీయ ప్రసక్తి లేకుండా మొదటి శ్రేణి శాస్త్రవేత్తలు రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలు నమ్మకం ఉంచాలని అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ విజ్ఞప్తి చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) శుక్రవారం ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించిన నేపథ్యంలో బైడెన్ ప్రజలకు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో మీకందరికీ తెలుసు. అయితే మంచి రోజులు ముందున్నాయని తాను గట్టిగా నమ్ముతున్నానని బైడెన్ ప్రజలను ఉద్దేశించి సూచించారు.

ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు , సంస్థలకు, ఇదే బాటలో ఉన్న మరికొంతమంది శాస్త్రవేత్తలకు, సంస్థలకు మనం కృతజ్ఞతలు తెలపవలసి ఉందని చెప్పారు. శుక్రవారం ట్రంప్ ఎఫ్‌డిఎపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పెద్దది, ముసలిది, మందకొడి తాబేలని ఎఫ్‌డిఎ పై ఎవ్యాఖ్యానించారు. ఎఫ్‌డిఎకు చెందిన డాక్టర్ హాన్‌ను ఉద్దేశించి ఆటలాడడం ఆపాలని, జీవితాలను కాపాడడం ప్రారంబించాలని కూడా ఆయన గట్టిగా మందలించారు. శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ వ్యాక్సిన్‌ను వెంటనే అనుమతించాలని లేకుంటే రాజీనామా చేయాలని హాన్‌ను ఆదేశించినట్టు వాషింగ్టన్ పోస్ట్ వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News