Monday, April 29, 2024

ఫైజర్ టీకా వినియోగానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

U.S. green signal for the use of the Pfizer vaccine

 

24 గంటల్లోపే మొదటి టీకా వేస్తాం : ట్రంప్

వాషింగ్టన్: ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డిఎ) అనుమతించింది. భద్రత, కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో తమ టీకా సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ సమర్పించిన ప్రయోగ ఫలితాలతో ఎఫ్‌డిఎ నిపుణుల కమిటీ గురువారం సంతృప్తి వ్యక్తం చేయడంతో ఎఫ్‌డిఎ వెంటనే అనుమతులు జారీ చేసింది. దీంతో ఫైజర్ టీకాను అనుమతించిన ఆరో దేశంగా అమెరికా గుర్తింపు పొందింది. బ్రిటన్ మొదట అనుమతులు జారీ చేయగా, బహ్రైన్, కెనడా, సౌదీ అరేబియా , మెక్సికో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్‌డిఎ అనుమతి పొందిన తరువాత ట్రంప్ దీనిపై స్పందిస్తూ కేవలం తొమ్మిది నెలల్లోనే భద్రత, సమర్థత కలిగిన టీకాను మనం పొందగలిగాం. ఇది చరిత్రలో గొప్ప సైంటిఫిక్ విజయం. దీనివల్ల కొన్ని లక్షల మందికి రక్షణ కలుగుతుంది.

త్వరలో కరోనా మహమ్మారి అంతం అవుతుందిఅని ట్రంప్ తన అనుభూతిని వెల్లడించారు. అమెరికన్లు అందరికీ ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందేలా చూస్తాం అని, 24 గంటల్లోనే మొదటి టీకా డోసును ప్రజలకు ఇవ్వడం ప్రారంభిస్తామని ట్విటర్‌లో విడుదల చేసిన టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు. ఫెడ్‌ఎక్స్, యూపిఎస్‌తో తమకున్న భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దేశం లోని ప్రతి రాష్ట్రానికి టీకా రవాణా ప్రారంభించామని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఎవరికి మొదటి డోసు ఇవ్వాలో గవర్నర్లు నిర్ణయిస్తారని, కరోనా ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు, వైద్యసిబ్బందికి మొదట టీకా అందించాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎఫ్‌డిఎ కమిషనర్ స్టెఫెన్ ఎం. హాన్ ఇది చెప్పుకోతగిన మైలురాయిగా అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News