Thursday, May 16, 2024

21 నుంచి టీకా శిక్షణ

- Advertisement -
- Advertisement -

వ్యాక్సిన్‌పై ఆశ, ఎఎన్‌ఎం, నర్సులకు అవగాహన
మొదటి తొలిసారి 42వేల మందికి టీకా పంపిణీ
మూడురోజుల్లో వ్యాక్సిన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ గైడ్‌లైన్ విడుదల
టీకా తీసుకున్న సిబ్బంది పాటించాల్సి జాగ్రత్తలు వెల్లడి

U.S. green signal for the use of the Pfizer vaccine

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం లక్షమంది ఆరోగ్య కార్యకర్తలను సిద్దం చేయగా, అందులో మొదటి తొలిసారి 42వేల మందికి పంపిణీ చేయనున్నారు. అందుకోసం ముందుగా వారికి నాలుగు రోజుల పాటు అవగాహన కల్పించనున్నట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 21 నుంచి ఆశాలు, ఎఎన్‌ఎం, నర్సులకు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో తరగతులు నిర్వహిస్తామని ఇస్తామని చెబుతున్నారు. వీరికి కంటే ముందుగా గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలో జిల్లాకు ఏడుగురు చొప్పన 21మంది వైద్యాధికారులకు కోఠిలోని ఆరోగ్యశాఖ సంచాలకుల కార్యాలయంలో ఆనెల 14 నుంచి వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వారంతా తమ పరిధిలోని ఉన్న వైద్య సిబ్బందికి టీకాపై అవగాహన కల్పించున్నారు. వ్యాక్సిన్ ఏవిధంగా తీసుకోవాలి, జాగ్రత్తలు ఏవిధంగాఈ పాటించాలని అనే విషయాలపై వివరించనున్నారు. అంతేగాకుండా టీకా ఒకేవేళ వికటించినా, పంపిణీలో సమస్యలు వచ్చిన ఎదుర్కొనేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క వ్యాక్సిన్ పంపిణీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టోరేజ్, టీకాపై రెండు మూడు రోజుల్లో కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి మార్గదర్శకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.నగరంలో ఉన్న 118 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యులు వెల్లడిస్తున్నారు.

నాలుగు విడుతల్లో ఆరోగ్య సిబ్బందికి టీకా వేసిన తరువాత, రెండో దశలో పోలీసు, పారిశుద్ద కార్మికులు, ఫ్రంట్‌లైన్‌లో పనిచేసేవారు, 50ఏళ్లలోపు దాటిన వారు, ఆనారోగ్య సమస్యలున్న వారి జాబితా తయారు చేసి పంపిణీ చేస్తారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులు,ఇతర వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇస్తామని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. వైద్యాధికారులు వివరాల ప్రకారం గ్రేటర్‌లోనే వైద్య సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ 166 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16,516 ఉండగా, 970 కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో 60,228 మంది ఉన్నారు. మొత్తంలో 76,804 మందికి టీకా ఇస్తారు. రంగారెడ్డి జిల్లాలో 59 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 5,899 మంది, 803 ప్రైవేటు ఆసుపత్రుల్లో 19,312 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం వ్యాక్సిన్ తరలిచేందుకు 15 వాహనాలు అవసరమని, ప్రస్తుతం ఎనిమిది వాహనాలుండగా, మరో ఏడు వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.నగర ప్రజలు టీకా పూర్తిగా అందరికి అందుబాటులో వచ్చేవరకు జాగ్రత్తలు పాటించాలని, ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ ఉపయోగించాలని, నిర్లక్షం చేస్తే సెకండ్ వేవ్ ప్రమాదంగా మారే అవకాశం ఉందని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

Corona Vaccine Training from Dec 21 in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News