Saturday, April 27, 2024

ఇండియాలోనే అతి పెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు తెలంగాణ నిలయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలగాణ/హైదరాబాద్: ఇండియాలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు తెలంగాణ నిలయమైంది. ఈ మేరకు మంత్రి కెటిఆర్ వివరాలు ప్రకటించారు. ‘అతి పెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు అయింది. జహీరబాద్‌లో అరుణ్ ఐస్‌క్రీమ్స్, ఇబాకోగా ప్రసిద్ధి చెందిన హాట్సన్ ద్వారా రోజుకు ఏడు టన్నుల చాక్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్, రోజుకు 100 టన్నుల ఐస్ క్రీమ్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. దీంతో తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌గా అవతరించింద’ని మంత్రి కెటిఆర్ అన్నారు.

ఈ మేరకు గురువారం మంత్రి కెటిఆర్ వివరాలు ప్రకటించారు. రూ.400 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో హాట్సన్ మొత్తం రూ.600 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న ‘శ్వేత విప్లవం’కు ఇదే నిదర్శనమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల పాలను సేకరించి 5,000 మంది స్థానిక పాడి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. దీని ద్వారా 1500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ‘హాట్సన్ ద్వారా రోజుకు 7 టన్నుల చాక్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్, రోజుకు 100 టన్నుల ఐస్‌క్రీమ్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభమవుతోంది.

తెలంగాణలో జహీరాబాద్‌లోని అరుణ్ ఐస్ క్రీమ్‌లు అండ్ ఇబాకో భారతదేశంలో అతి పెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు నిలయంగా ఉందని పంచుకోవడం సంతోషంగా ఉంద’ని కెటిఆర్ ట్వీట్ చేశారు. దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం కంపెనీల జహీరాబాద్‌లో ప్రారంభం కావడంపై మంత్రి కెటిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. హాట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7 టన్నుల చాకోలెట్స్, 100 టన్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేస్తారన్నారు. ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్‌క్రీమ్స్, ఇబాకో జహీరాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నట్టుగా వెల్లడించారు.

Biggest Ice-Cream Manufacturing Unit in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News