Tuesday, April 30, 2024

అకస్మాత్తుగా సచివాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి నితీశ్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

పాట్నా : మంత్రులు, ఉన్నతాధికారుల పనితీరు తెలుసుకోడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం రాష్ట్ర సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆశ్చర్యపోయారు. ఉదయం 9.30 గంటలకు ఆయన సచివాలయానికి వెళ్లి చూసేసరికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు విధులకు హాజరు కాలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల్లోగా అందరు మంత్రులు, అధికారులు కచ్చితంగా సచివాలయంలో ఉండాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.

మొదట సచివాలయం వికాశ్ భవన్‌కు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెళ్లి చూడగా విద్యామంత్రి చంద్రశేఖర్, చక్కెర పరిశ్రమ మంత్రిఅలోక్ కుమార్, పరిశ్రమల మంత్రి సమీర్ కుమార్, రవాణా మంత్రి షీలా కుమారి, వ్యవసాయ మంత్రి కుమార్ సర్వజీత్ తదితర మంత్రులు ఇంకా రాలేదు. కొందరి మంత్రులకు సీఎం అక్కడి నుంచే ఎందుకు రాలేదని ప్రశించారు. అక్కడ నుంచి సాంకేతిక సచివాలయం విశ్వేశ్వరాయ భవన్‌కు నితీశ్ వెళ్లి చూడగా, అక్కడ కూడా ఉన్నతాధికారులు గైర్హాజరవ్వడాన్ని గమనించారు. ఉదయం 9.30 గంటల్లోగా కచ్చితంగా విధులకు హాజరు కావాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News