Tuesday, April 30, 2024

పార్లమెంటు జాయింట్ కమిటీకి బయో డైవర్సిటీ బిల్లు

- Advertisement -
- Advertisement -

Biodiversity Bill to Parliamentary Joint Committee

న్యూఢిల్లీ: బయోడైవర్సిటీ బిల్లును పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన సంయుక్త కమిటీకి లోక్‌సభ సోమవారం నివేదించింది. ఈ జాయింట్ కమిటీలో లోక్‌సభకు చెందిన 21 మంది సభ్యులు, రాజ్యసభనుంచి 10 మంది సభ్యులు ఉంటారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ బిల్లును జాయింట్ కమిటీకి నివేదించే తీర్మాననాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ కమిటీ తన నివేదికను వచ్చే పార్లమెంటు సమావేశాల తొలి వారం చివరి రోజు నాటికి సమర్పించాల్సి ఉంటుంది. కమిటీలో ఉండే లోక్‌సభ సభ్యుల పేర్లను స్పీ కర్ ప్రకటించారు. 12 మంది బిజెపి సభ్యులతో పాటుగా కాంగ్రెస్‌నుంచి ఇద్దరు, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, వైఎస్‌ఆర్ సిపి, శివసేన, జెడియు, బిజెడి, బిఎస్‌పిలనుంచి ఒక్కో సభ్యుడు కమిటీలో ఉంటారు. రాజ్యసభ సభ్యులను త్వరలోనే ప్రకటిస్తారు. బిల్లును పార్లమెంటు స్థాయి సంఘానికి పంపించాలని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ గతంలో డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News