Monday, April 29, 2024

జన భాషకు దివిటీ పట్టిన గిడుగు

- Advertisement -
- Advertisement -

ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలివ్వడం మొదలుపెట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా ప్రారంభం కాలేదు.తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త ‘పంతులు గారిది సామాన్యమైన ఎత్తు. ఇది గిడుగు కాదు పిడుగు అన్నట్టుగా ఉంటాడు. ఆయనకుండే పట్టుదల అంతా మొహం లోని కనపడుతుంది. ఎరుపు ఛాయ, తలపాగా, కోటు, పంచ అన్ని తెల్లటివే ధరిస్తారు .భాషా విషయంలో మాత్రం వారి ఉద్రేకం పట్ట రానిది.‘ 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. మహారాజా వారి ఇంగ్లీషు పాఠశాల విజయనగరంలో విద్యాభ్యాసం చేశారు .కలెక్టర్ ఆఫీసులో కొంతకాలం పనిచేసి , పర్లాకిమిడి హైస్కూల్లో చేరారు. ముక్కు సూటి వ్యక్తిత్వం వారిది .వ్యవహారిక భాషా వాదాన్ని ప్రారంభించిన గిడుగు వారు గ్రాంథిక భాషా ద్వేషి కానే కాదు. ఆయన ప్రాచీన సాహిత్యంలో చదవని గ్రంథం లేదు .తెలియని అర్థం లేదు .పద స్వరూపం లేదు గ్రాంధిక వాదులు అందరు కన్నా గొప్ప పాండిత్యం భాష అధికారం గల గొప్ప పండితుడాయన. అమోఘమైన జ్ఞాపకశక్తి కలవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News