Sunday, May 5, 2024

తెలుగు సాహిత్యంలో మేరు శిఖరం రవ్వా శ్రీహరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన కులాలపైకి రావాలంటే చదువులో ముందుండాలని రవ్వా శ్రీహరి నేర్పిన పాఠం విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోరని పలువురు వక్తలు తెలిపారు. సంస్కృత వ్యాకరణానికి భాష్యం చెప్పి ప్రజల మాండలికానికి తయారు చేసిన తెలుగు సాహిత్య మార్గదర్శకుడు రవ్వా శ్రీహరి అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో ‘రవ్వా శ్రీహరి రచనలు – విహంగ వీక్షణం ’ అన్న అంశంపై చర్చ కార్యక్రమం జరిగింది. ఈ సభలో మనస చెన్నప్ప మాట్లాడుతూ రవ్వా శ్రీహరి సంస్కృత వ్యాకరణానికి భాష్యం చెప్పాడని తెలిపారు. రవ్వా శ్రీహరికి వ్యాకరణం ప్రాణమని, శబ్దం మీద పట్టు ఉన్నవాడని కొనియాడారు.

తెలంగాణ భాషలో నల్లగొండ ప్రజల మాండలికాన్ని తయారు చేశారన్నారు. ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్లేషించిన రవ్వా శ్రీహరి చెప్పే పాఠాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ భాషా సాహిత్యాలు ఉన్నంతవరకు రవ్వా శ్రీహరి పేరు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. కుల సమాజంలో కూడా జ్ఞానంతో ఎదిగిన వ్యక్తి రవ్వా శ్రీహరి అన్నారు. ఈ సదస్సులో తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు ప్రొఫెసర్ కె యాదగిరి, డాక్టర్ ఎస్ రఘు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్, బుక్ ఫెయిర్ సెక్రటరీ ఆర్ వాసు, పరిశోధక విద్యార్థి యాదగిరి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News