Saturday, May 4, 2024

మల్కాజ్‌గిరి నుంచి ఈటెల… మెదక్ నుంచి రఘునందన్ రావు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికలలో 8 నుంచి 12 సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేస్తుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈ నెల 27 లేదా 28 న తెలంగాణకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్నారు. ఎంపి టికెట్ల కోసం ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. భాగ్యనగరంలో స్థిరపడిన నార్త్ ఇండియన్ భగవంతరావు హైదరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ కోసం బలమైన అభ్యర్థుల్ని వెతికే పనిలో అధిష్టానం పడింది. పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపై బిజెపి పోకస్ పెట్టింది.

1.మహబూబ్‌నగర్: డికె అరుణ, జితేందర్ రెడ్డి, దిలీప్ ఆచారి,
2.చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్
3.మల్కాజ్‌గిరి: ఈటెల రాజేందర్, చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్
4.సికింద్రాబాద్: కిషన్ రెడ్డి
5.నిజామాబాద్: ధర్మపురి అరవింద్
6.కరీంనగర్: బండి సంజయ్ కుమార్
7.ఆదిలాబాద్: సోయం బాబురావు
8.మెదక్: రఘునందన్ రావు?
9.నల్లగొండ: సునీతారెడ్డి?
10.జహీరాబాద్: చికోటి ప్రవీణ్ కుమార్, ఎంఎల్‌ఎ రాజాసింగ్, ఆకుల విజయ?
11.వరంగల్: మాజీ ఐపిఎస్ కృష్ణా ప్రసాద్?
12.భువనగిరి: బూర నర్సయ్య గౌడ్?
13.హైదరాబాద్: భగవంతరావు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News