Sunday, May 5, 2024

కెసిఆర్ అంటే ఆ రెండు పార్టీలకు భయం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

BJP Congress feared with KCR

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్లీనరీ బ్రహ్మాండంగా విజయవంతమైందని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ఒక్కడిగా ఉద్యమం మొదలు పెట్టి 33 పార్టీ లను ఒప్పించి తెలంగాణ సాధించారని ప్రశంసించారు. అధికారం లోకి వచ్చాక సిఎంగా 33 జిల్లాలు ఏర్పాటు చేశారని,  ప్లీనరీ సక్సెస్ తో ప్రతిపక్షాలకు కడుపు మంట గా మారిందని, అందుకే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధిని చూసి నేర్చుకునేందుకు వేరే రాష్ట్రాల అధికారులు వస్తూనే ఉన్నారని, రెండు జాతీయ పార్టీల పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడం లేదని శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.

ఏడేళ్ళ పసికూన తెలంగాణ అని, దేశం గర్వపడేలా అభివృద్ధి సాధిస్తోందని మెచ్చుకున్నారు. కెసిఆర్ లాంటి నాయకుడు తమకు కావాలని ఎపితో సహా అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు.  టిఆర్ఎస్ అణగారిన వర్గాల ప్రయోజనాలను కోరుకోవడంతో జాతీయ పార్టీలకు కడుపు మంటగా మారిందన్నారు. కాంగ్రెస్ బిజెపి నేతలకు కెసిఆర్ మీద కోపం ఎందుకంటే బిసి జన గణన అడిగినందుకన్నారు. బిసి జన గణన జరిగితే వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని, అందుకు కాంగ్రెస్ బీజేపీ లకు కెసిఆర్ అంటే భయమన్నారు. పేద ప్రజల పక్ష పాతి కెసిఆర్ అని, కాంగ్రెస్ బిజెపిలకు ఆయనంటే భయం పట్టుకుందన్నారు. కెసిఆర్ పాలన లో బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు బాగుపడుతుండడంతో కాంగ్రెస్ బిజెపిలు భయపడుతున్నాయన్నారు. దీంతో కెసిఆర్ మీద పగ పెంచుకున్నారన్నారు.  టిఆర్ఎస్ ప్లీనరీ లో ఏం చేయాలన్నది మా అంతర్గత వ్యవహారమన్నారు. ప్లీనరీతో టిఆర్ఎస్ మరో ఇరవై ఏండ్ల పాటు అధికారంలో ఉంటుందని భరోసా కలిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News