Saturday, May 11, 2024

దూకుడు పెంచిన లూయిస్ అర్థశతకం.. ఔట్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్‌ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఓపెనర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. ఓపెనర్ సిమ్మన్స్ ఆచితూచి ఆడుతున్నా.. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో 35 బంతుల్లో 6 సిక్స్ లు, మూడు ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 10.3 ఓవర్లలో 73 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం విండీస్ జట్టు 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(12), సిమ్మన్స్(14)లు ఉన్నారు.

T20 World Cup: Lewis hits 50 runs against SA 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News