Saturday, April 27, 2024

తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్ధబోతున్నాం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ పెడరేషన్ అధ్వర్యంలో జరగనున్న జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2021 బ్రోచర్ ను  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగా జాతీయ పవర్ లిప్టింగ్ చాంపియన్ షిఫ్ కు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో నవంబర్ 16 నుండి 20 వరకు జాతీయ పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ ను పెడరేషన్ నిర్వహిస్తుందన్నారు. ఈ చాంపియన్ షిప్ లో 26 రాష్ట్రాలు పాల్గోనబోతు న్నాయన్నారు.

కరోనా పరిస్థితుల తర్వాత జాతీయ స్థాయిలో ఈ చాంపియన్ షిప్ ను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మంటన్, టెన్నిస్, కబడ్డీ, రెస్లింగ్, బాడీ బిల్డింగ్, పుట్ బాల్ లాంటి అనేక క్రీడాంశాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు రాణిస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం, నగదు పురస్కారాలను ఘననీయంగా పెంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాము. క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విధ్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ను కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మిస్తున్నామన్నారు.

సిఎం కెసిఆర్ అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని రూపోందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్ధబోతున్నామన్నారు. పవర్ లిప్టింగ్ లో మన తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు రాజశ్రీ, శ్రీనాధ్, సాయి లలీత్, రాజశేఖర్ లాంటి క్రీడాకారులను తెలంగాణ క్రీడా శాఖ ద్వారా ఎంతో ప్రోత్సాహన్ని అందిస్తున్నామన్నారు.

National powerlifting championship in LB Stadium from Nov 16

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News