Tuesday, April 30, 2024

రాముడిపై బిజెపికి పేటెంట్ లేదు

- Advertisement -
- Advertisement -

భోపాల్: శ్రీరాముడు, హనుమంతుడు లేదా హిందూ మతంపై బిజెపికి పేటెంట్  హక్కులేవీ లేవని బిజెపి సీనియర్ నాయుకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. వీటిపై ఎవరికైనా విశ్వాసం ఉండవచ్చని, అయితే తమ విధేయత రాజకీయ ప్రయోజనాలకు అతీతమైనదని ఆమె అన్నారు. భగవాన్ శ్రీరాముడు, జాతీయ పతాకం, గంగానది, గోమాత పట్ల భక్తి విశ్వాసాలు తనకు బిజెపి కల్పించలేదని, అవి పుట్టుక నుంచే తనలో ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో ఉమాభారతి పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో మద్యంపై నిషేధం విధించాలన్న తన డిమాండును ప్రస్తావిస్తూ బిజెపి ఆదేశాల మేరకే తాను నడుచుకుంటానని ఆమె తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉద్దేశాన్ని ఆమె ప్రశ్నించారు. భారత్ ఇప్పుడు ఎక్కడ ముక్కలైందని ఆయన జోడో యాత్ర చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టికల్ 370(జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి) రద్దు చేసిందని ఆమె గుర్తు చేశారు. దేశాన్ని చీలుస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) మాత్రమేనని, రాహుల్ గాంధీ జోడో యాత్రను పిఓకెకు చేస్తే బాగుంటుందని ఆమె సలహా ఇచ్చారు. 2023లో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News