Wednesday, October 9, 2024

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి సినిమాకి సీక్వెల్ రానుంది..

- Advertisement -
- Advertisement -

| మహేష్‌ అభిమానులే కాదు, సినీ సెలబ్రెటీల సైతం ‘SSMB29’ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఉన్నారు. బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ పాన్‌ ఇండియా సినిమాలతో గ్లోబల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, వెండితెరపై మహేష్‌ను ఎలా చూపిస్తాడో అని క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇటివలే రైటర్‌ కేవి. విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్‌ను బేస్‌ చేసుకొని తెరకెక్కుతుందని, ఇదొగ అడ్వేంచర్‌ విజయేంద్ర ప్రసాద్‌చిత్రమని వెల్లడించాడు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సినిమాను ఫ్రాంచైజీగా డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి భాగం స్క్రిప్ట్‌ని ఫైనల్ చేసే పనిలో ఉన్నామని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. కెవి విజయేంద్ర ప్రసాద్ ను ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉంటాయా అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు సీక్వెల్స్ వస్తాయని , ఈ సీక్వెల్స్‌లో కథ మారుతుందని, ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయని ఆయన అన్నారు.

రాజమౌళి చాలా కాలంగా అటవీ సాహసం సినిమా చేయాలని అనుకుంటున్నారని, కానీ ఆ సినిమా చేసే అవకాశం తనకు రాలేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. కానీ ఇప్పుడు అతను అటవీ సాహస చిత్రానికి మహేష్ బాబు ఉత్తమ ఎంపిక అని అతను భావిస్తున్నాడని, ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయడానికి మహేష్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడని, రాజమౌళితో ఒక్క సినిమా చేయడం అంటే ఒకేసారి 25 సినిమాలు తీయడం లాంటిదని ఆయన అన్నారని చెప్పుకొచ్చారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడంతో రాజమౌళి ఈ సినిమాను గ్రాండ్‌ స్కేల్‌లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడట. కే.ఎల్‌నారాయణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడట. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో ఏక‌కాలంలో తెర‌కెక్కిస్తార‌ట‌. ఆ త‌ర్వాత మిగితా భాష‌ల్లో డ‌బ్ చేస్తార‌ట‌.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News