Saturday, May 4, 2024

అడల్ట్ కంటెంట్‌తో…

- Advertisement -
- Advertisement -

Boys movie teaser released

 

న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ మూవీ ‘బాయ్స్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ మిత్రా శర్మ ఈ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో మిత్రా శర్మతో పాటుగా గీతానంద్, – రోనిత్, – అన్షులా ధావన్, – శ్రీహాన్, జెన్నిఫర్, – షీతల్ తివారీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం ‘బాయ్స్’ టీజర్‌ను విడుదల చేశారు. సెన్సేషనల్ స్టార్ సన్నీలియోన్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల చేయబడింది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి కేక్ కట్ చేసిన సన్నీ లియోన్.. వారికి బెస్ట్ విషెస్ అందించారు. టీజర్‌లో మూడు జంటల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, – కిస్సింగ్ సీన్స్ – బెడ్ సీన్స్, – డబుల్ మీనింగ్ డైలాగ్స్.. ఇలా అడల్ట్ కంటెంట్ అంతా చూపించారు. హీరోయిన్లు బికినీలతో దర్శనమిచ్చారు. ఈ సినిమా ‘అమెరికన్ పై’, ’గ్రాండ్ మస్తీ’ వంటి చిత్రాలను గుర్తు చేసేలా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై మిత్ర శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News