Thursday, May 2, 2024

బ్రహ్మోస్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

BrahMos anti-ship missile launch successful

 

న్యూఢిల్లీ : బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ నావల్ వెర్షన్‌ను భారత్ నావికా దళం మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. త్రివిధ దళాలు వరుసగా చేపడుతున్న ప్రయోగాల్లో భాగంగా బంగాళాఖాతంలో ఈ ప్రయోగం చేపట్టారు. భారత్ష్య్రా సంయుక్త భాగస్వామ్యంతో తయారౌతున్న ఈ క్షిపణులను జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, భూ ఉపరితలం నుంచి కూడా ప్రయోగించ వచ్చు. నవంబర్ 24న ఉపరితల లక్షాన్ని ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఆర్మీ ప్రయోగించగా, ఈ సామర్థాన్ని 290 కిమీ నుంచి 400 కిమీ వరకు విస్తరించారు. సరిహద్దు లోని వాస్తవాధీన రేఖ పొడవునా లడక్ వద్ద బ్రహ్మోస్ క్షిపణులను, ఇతర కీలకమైన ఆయుధాలను భారత్ మోహరించింది. గత రెండున్నర నెలల్లో భారత్ యాంటీ రేడియేషన్ క్షిపణులు రుద్రం 1తోసహా అనేక క్షిపణులను భారత్ పరీక్షించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News