Friday, May 3, 2024

విమాన ప్రమాదంలో బ్రెజిల్ పాప్‌స్టార్ మృతి

- Advertisement -
- Advertisement -

Brazilian pop star Maria Mendoza died after plane crash

 

రియోడి జనిరో: మరి కొద్ది గంటల్లో మ్యూజికల్ కచేరిలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాల్సిన ప్రముఖ గాయని ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. తాను ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో బ్రెజిలియన్ పాప్ స్టార్ మారలియా మెండోకా( 26) కన్ను మూసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమెతో పాటు మేనేజర్, సహాయకుడు, పైలట్, కోపైలట్ కూడా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. మరణానికి కొద్ది గంటల ముందు ఆమె విమానంనుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇంతలోనే ఆమె తిరిగి రాని లోకానికితరలి పోవడం విచారకరమని ఆమె సన్నిహితులు, అభిమానులు కంటతడి పెడుతున్నారు. మారలియా స్వస్థలమైన మిడ్‌వెస్ట్ నగరం గోయానియానుంచి కరాటింగాకు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురయింది. విమానం భూమిని తాకే ముందు తమ విద్యుత్ పంపిణీ లైన్‌ను ఢీకొట్టిందని ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థ సెమిగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో బ్రెజిల్‌లో ప్రముఖ గాయకుల్లో ఒకరైన మారిలియా మెడోంకా, మేనేజర్ హెన్నిక్ రెబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటుగా విమానం పైలట్, కోపైలట్ మృతి చెందినట్లు మెడోంకా ప్రతినిధి ఒకరు తెలిపారు. మినాస్ గెరాయిస్ రాష్ట్ర పోలీసులు కూడా మెండోంకా మరణాన్ని ధ్రువీకరించారు గానీ, ప్రమాదానికి కారణాలు తెలియజేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News