Monday, April 29, 2024

క్రిప్టో కరెన్సీ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Cryptocurrency gang arrested in Hyderabad

నారపల్లికి చెందిన బాధితుడి నుంచి రూ.80లక్షలు వసూలు
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు

హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.50లక్షలను నిలిపివేశారు. వారి వద్ద నుంచి చెక్‌బుక్‌లు, ఆరు ఎటిఎం కార్డులు, ఆరు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….పశ్బిమ బెంగాల్‌కు చెందిన చోటా భాయ్ అలియాస్ దీపు మండల్ ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నూర్‌అలాం హకీ బ్యాంక్ ఉద్యోగి, దీనాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఎక్రం హుస్సేన్, ఇస్లాంపూర్ జిల్లాకు చెందిన ఎండి ఐజ్‌రుల్ కలిసి నేరాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు చోటాభాయ్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఎక్కువగా డబ్బులు వస్తాయని చెప్పి అమాయకులను మోసం చేయాలని ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా షెల్ కంపెనీలను ప్రారంభించాడు. వీటికి ఎక్కడా ఆఫీసులు ఉండవు, కేవలం వాటి పేరు చెప్పి డబ్బులు దోచుకునేందుకు ఏర్పాటు చేశాడు. వాటిలో పెట్టుబడి పెట్టాలని అమాయకులకు చెబుతున్నారు. దీనికి బ్యాంక్ ఉద్యోగి నూర్‌ఆలం హకీ సహకరిస్తున్నాడు. ఇద్దరు కలిసి 64 బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశారు. వివిధ పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని అమాయకులకు ఫోన్లు చేసి పెట్టుబడి పెట్టిస్తున్నారు.

వీరికి ఎక్రం హుస్సేన్, ఎండి ఐజరుల్ సహకరిస్తున్నారు, వీరు ఇద్దరు కలిసి గ్రామాలకు చెందిన బాధితుల ఐడి ఫ్రూఫ్‌లు తీసుకువస్తున్నారు. వారికి కొంత కమీషన్ ఇచ్చి వారి పేరుతో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి డెబిట్ కార్డులు, ఇంటర్‌నెట్ క్రెడెన్షియల్స్‌ను తీసుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెట్టే వారిని వీరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. నిందితులు 14 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నారపల్లికి చెందిన భానోతు కిరణ్ కుమార్‌కు వాట్సాప్‌లెఓ మెసేజ్ వచ్చింది. దానిని నమ్మిన బాధితుడు ముందుగా రూ.50,000 పెట్టుబడి పెట్టాడు. నిందితులకు రూ.50 వేలకు రూ.10,000 లాభం విచ్చినట్లు కలిపి ఇచ్చారు. తర్వాత నిందతులు బాధితుడికి ఫోన్ చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పారు. ఇది నిజమని నమ్మిన బాధితుడు రూ.80,00,000కు పెట్టుబడి పెట్టాడు. అప్పటి నుంచి నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించి బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌స్పెక్టర్ రాము దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News