హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో 4 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా హైవేల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ చేపట్టేందుకు కేంద్రం ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్-కల్వకుర్తి మధ్య 4 లైన్ల హైవే కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని అడిగామని పేర్కొన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. భూసేకరణ త్వరగా పూర్తి చేస్తే.. ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా అవుతుందని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.
మెట్రో విస్తరణలో సిఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సమంజసంగా లేదని కిషన్‌రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని కో్రుకునే వ్యక్తుల్లో తాను ముందుంటా అని తెలిపారు. ఆర్ఆర్ఆర్, మెట్రో విషయంలో ప్రోయాక్టివ్‌గా వ్యవహరించాం అని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోందని.. మెట్రో నష్టాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని.. వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. మెట్రోకు అన్ని రకాలుగా తమ సహకారం ఉంటుందని అన్నారు.
కాళేశ్వరంపై సిబిఐ ప్రతిపాదనలు అందాయని.. ప్రస్తుతం అది పరిశీలనలో కిషన్‌రెడ్డి ఉందని తెలిపారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బిజెపి భయం పట్టుకుందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ తోనో.. కాంగ్రెస్ తోనో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి ప్రభుత్వాలు నడిపాయి. మేం తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం. కాంగ్రెస్, బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపినే. బిసి రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతిచ్చాం. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read : వివిధ రాష్ట్రాలతో తెలంగాణకు జాతీయ రహదారులు అనుసంధానం: కిషన్ రెడ్డి