Monday, May 6, 2024

నేటి నుంచి బిఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ భవన్ వేదికగా బుధవారం(జనవరి 3) నుంచి బిఆర్‌ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నది. బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగం గా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… ఈ జనవరి 13 నుంచి 15 వరకు మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.

ఈ సన్నాహక సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపిలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయ ర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లాపార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

పార్లమెంట్ నియోజకవర్గం సమావేశాలు
జనవరి 3వ తేదీన ఆదిలాబాద్
జనవరి 4వ తేదీన కరీంనగర్
జనవరి 5వ తేదీన చేవెళ్ల
జనవరి 6వ తేదీనపెద్దపల్లి
జనవరి 7వ తేదీన నిజామాబాద్
జనవరి 8వ తేదీన జహీరాబాద్
జనవరి 9వ తేదీన ఖమ్మం
జనవరి 5వ తేదీన వరంగల్
జనవరి 11 తేదీన మహబూబాబాద్
జనవరి 12వ తేదీన భువనగిరి
సంక్రాంతి అనంతరం..
జనవరి 16వ తేదీన నల్గొండ
జనవరి 17వ తేదీన నాగర్ కర్నూలు
జనవరి 18వ తేదీన మహబూబ్ నగర్
జనవరి 19న తేదీన మెదక్
జనవరి 20వ తేదీన మల్కాజ్ గిరి
జనవరి 21వ తేదీన సికింద్రాబాద్, హైదరాబాద్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News