Monday, April 29, 2024

టిఆర్‌ఎస్‌గా మారనున్న బిఆర్‌ఎస్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంచలనం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారత రాష్ట్ర సమితి పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే అవకాశం ఉంది. బిఆర్‌ఎస్ పేరును టిఆర్‌ఎస్‌గా మార్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలలో టిఆర్‌ఎస్ పేరుతో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో ఓటమిని చవిచూశామని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ టిఆర్‌ఎస్‌గా మారిస్తే వచ్చే చిక్కులు గురించి అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిఆర్‌ఎస్‌ను టిఆర్‌ఎస్ చేస్తే బాగుండునని తన  అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్టీ పేరు మార్చడంతోనే భారీ నష్టం జరిగిందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో అధికారులోకి వచ్చినప్పటి నుంచి బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు పెరిగాయి. తాజాగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. 17 లోక్ సభ స్థానాలలో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మే 13న తెలంగాణలో ఎంపి ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News