Home తాజా వార్తలు ప్రముఖ వ్యాపారవేత్త గోవర్థన్ కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త గోవర్థన్ కన్నుమూత

Businessman Govardhan passed away

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుకల గోవర్ధన్ మంగళవారం కన్నుమూశారు.  ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో గోవర్థన్ తుదిశ్వాస విడిచారని కుటుంబు సభ్యులు తెలిపారు. పార్థివ దేహాన్ని ఈ ఉదయం 10 గంటలకు నల్లగొండలోని నటరాజ్ థియేటర్ వద్ద మిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆయన మృతిపట్ల నల్లగొండ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకులు, వ్యాపారవేత్తలు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.