Sunday, April 28, 2024

సిఎఎ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో అమలుకు అనుమతించం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన

బరసత్(ప.బెంగాల్): పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైనవిగా ఆమె అభివర్ణించారు. మంగళవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రాలో ఒక అధికారిక కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్‌లో సిఎఎ అమలుకు తాను అనుమతించబోనని ప్రకటించారు. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆమె కోరారు. సోమవారం ప్రకటించిన సిఎఎ నిబంధనలకు చట్టబద్ధతపై తనకు అనుమానాలు ఉన్నాయనిటిఎంసి అధినేత్రి తెలిపారు.

వాటిపై స్పష్టత లేదని ఆమె వ్యాఖ్యానించారు. సమానత్వానికి చెందిన ప్రాథమిక హక్కును ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద సిఎఎ, దాని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమని మమత అన్నారు. పౌరసత్వం కల్పిస్తామని చెబుతూ కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆటోమేటిక్‌గా అక్రమ వలసదారులవుతారని ఆమె తెలిపారు. ఇది హక్కులను లాగేసుకోవడానికి ఆడుతున్న నాటకంగా ఆమె అభివర్ణించారు. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆటోమేటిక్‌గా అక్రమ వలసదారులవుతారని, వారిని నిర్బంధ శిబిరాలకు తరలిస్తారని ఆమె చెప్పారు.

ఒక్కరికైనా పౌరసత్వం లభిస్తే తాను సంతోషిస్తానని, ఎవరికైనా లభించకపోతే తాను ఆశ్రయం కల్పిస్తానని మమత హామీ ఇచ్చారు. ఎవరినైనా గెంటేయడానికి ప్రయత్నిస్తే తాను అనుమతించబోనని ఆమె స్పష్టం చేశారు. సిఎఎ అమలుకు ఎన్‌ఆర్‌సితో ప్రత్యేక్ష సంబంధం ఉందని ఆమె చెప్పారు. ఇప్పటికే పౌరులుగా ఉన్న ముస్లిం వలసదారులను అక్రమ వలసదారులుగా ప్రకటించి ఎన్‌ఆర్‌సి కింద వేధఙస్తారని ఆమె తెలిపారు. అటువంటి అక్రమ వలసదారుల ఆస్తుల పరిస్థితి ఏమిఊటో అర్థం కావడం లేదని, వాటిని కూడా జప్తు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News