Wednesday, May 1, 2024

అమ్మాయిల వివాహ వయసు పెంపు

- Advertisement -
- Advertisement -

Cabinet approves minimum marriage age of women from 21

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంచారు. వివాహ వయసు పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మాయిల వయసు తక్కువగా ఉండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పురుషుల వయసు 21 సంవత్సరాలు ఉండడంతో అమ్మాయిల వయసు కూడా పెంచాలనే డిమాండ్ వచ్చింది. అమ్మాయి వయసు పెంచడపై కేంద్రం ప్రభుత్వం నీతి ఆయోగ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్‌కు అరుణ్ జైట్లీ నేతృత్వం వహించారు. ఈ టాస్క్ ఫోర్స్‌లో ప్రభుత్వ నిపుణులు డాక్టర్ వికె పాల్, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. అమ్మాయిలు గర్భం దాల్చేనాటికి 21 సంవత్సరాల వయసు ఉండాలని ఆ కమిటీ సూచించింది. 21 ఏళ్ల తరువాత వివాహం చేయడంతో ఆమెపై ఆర్థికంగా సామాజికంగా, ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం ఉంటుందని టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News