Sunday, April 28, 2024

కెనరా బ్యాంక్ లాభం మూడు రెట్లు

- Advertisement -
- Advertisement -

Canara Bank Net profit rises nearly three-fold to Rs 1,177 cr

క్యూ1లో రూ.1,177 కోట్ల లాభం

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ అద్భుతంగా రాణించింది. బ్యాంక్ నికర లాభం రూ.1,177 కోట్లతో మూడు రెట్లు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.406 కోట్లతో పోలిస్తే 190 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీ యేతర ఆదాయం పెరగడం, మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గుముఖం పట్టడం వల్ల ఈసారి బ్యాంక్ మంచి లాభాలను నమోదు చేసింది. 2020 ఏప్రిల్ నుంచి ఈ బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనం అమల్లోకి వచ్చింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.20,685 కోట్ల నుంచి రూ.21,210 కోట్లకు పెరిగింది. అలాగే వార్షికంగా నికర వడ్డీ ఆదాయం రూ.6,096 కోట్ల నుంచి రూ.6,147 కోట్లతో 0.84 శాతం పెరిగింది.

నికర వడ్డీ మార్జిన్ 2.84 శాతం నుంచి 2.71 శాతానికి తగ్గింది. బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగైంది. స్థూల ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తులు) 8.84 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పిఎ 3.95 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గింది. ఎన్‌పిఎలకు కేటాయింపులు గతేడాది రూ.3,550 కోట్ల నుంచి రూ.2,335 కోట్లతో 34 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి రూ.2,500 కోట్ల ఈక్విటీ మూలధనం సమీకరించాలని బ్యాంక్ ప్రణాళికను సిద్ధం చేసింది. అదే సమయంలో రూ.4 వేల కోట్ల విలువచేసే టైర్1 బాండ్లు (ఎటి1 బాండ్స్), రూ.2500 కోట్ల విలువచేసే టైర్2 బాండ్లను జారీ చేయాలని బ్యాంక్ యోచిస్తోంది. కెనరా బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 9,877 బ్రాంచ్‌లు, 11,819 ఎటిఎంలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News