Sunday, May 5, 2024

బ్యాలట్ బాక్సుతో పరుగో పరుగు

- Advertisement -
- Advertisement -

ల్‌కత: పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఒక మహిళా అభ్యర్థి భర్త బ్యాలట్ బాక్సు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని వెంటపడి చేజిక్కించుకున్నారు. ఈ ఘటన మాల్డా జిల్లాలోని గోవానరగ్ గ్రామ పంచాయతిలో మంగళవారం చోటుచసుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. గ్రామస్తులంతా పారిపోతున్న ఒక వ్యక్తి వైపు చేతులు చూపించడం ఇందులో కనిపించింది.

బ్యాలట్ బాక్సు చేత పట్టుకుని పొదల్లోకి పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు పరుగులు తీశారు. చివరకు అతడిని పట్టుకున్న పోలీసులు బడితపూజ చేసి మరీ బ్యాలట్ బాక్సు స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రహసనం అనంతరం తిరిగి బ్యాలట్ బాక్సు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంది.

పశ్చిమ బెంగాల్‌లో జులై 8వ తేదీన హింసాత్మక ఘటనల మధ్య పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్బంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 15 మంది వరకు మరణించారు. ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో 696 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ జులై 10న రీపోలింగ్ నిర్వహించింది. నేటి ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News