Saturday, May 4, 2024

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైద్రాబాద్: చాంద్రాయణగుట్ట ఎంఎల్‌ఎ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ పై సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డిసిపి రోహిత్ రాజు తెలిపారు. ప్రచార సమయం ముగిసిందని, ప్రచారం ఆపాలని సంతోష్ నగర్ సిఐ ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్‌కు మంగళవారం రాత్రి 10 గంటలు దాటిన తరువాత సూచించారు. నిర్ణీత సమయం ముగిసిన తరువాత లలితాబాగ్‌లో అక్బరుద్దీన్ ఒవైసి ప్రచారం నిర్వహిస్తుండటంతో ప్రచారం నిలిపివేయాలని పోలీసులు సూచించారు.

కానీ సంతోష్ నగర్ సిఐ శివచంద్రపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మిమ్మల్ని పరుగులు పెట్టించాలా, నాలో ఇంకా సత్తా ఉందంటూ వేలెత్తి చూపిస్తూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, వారిని హెచ్చరించడం లాంటి పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్‌పై సంతోష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ లలితాబాగ్‌లో మంగళవారం రాత్రి ప్రచారం చేశారు. అయితే రాత్రి 10 గంటలు దాటిపోయిందని ప్రచారం ఆపాలని సంతోష్‌నగర్ సిఐ అక్బరుద్దీన్‌కు సూచించారు.

పోలీసులు చెప్పిన మాటతో అక్బరుద్దీన్ ఆవేశానికి లోనయ్యారు. నన్నే ఆపుతావా, కత్తులు దిగాయి, బుల్లెట్లు దిగాయని నాలో సత్తా తగ్గింది అనుకుంటున్నావా అంటూ పోలీసులపై మండిపడ్డారు. కనుసైగ చేస్తే చాలు పోలీసులను ఇక్కడి నుంచి పరిగెత్తిస్తామంటూ సంతోష్ నగర్ సిఐకి అక్బరుద్దీన్ వార్నింగ్ ఇచ్చారు. సమయం మించిపోయిం దని పోలీసులు వారిస్తున్నా తన దగ్గర సైతం వాచీ ఉందని, ఇంకా 5 నిమిషాలు ప్రచారం చేసుకునే టైం ఉందని అక్బరుద్దీన్ అన్నారు. తనను ఆపడం ఎవరివల్ల కాదని, ఈ 5 నిమిషాలు కచ్చితంగా ప్రచారం చేస్తానంటూ సిఐతో వాగ్వాదానికి దిగారు.

గతంలో ఉన్న ఆవేశం, సత్తా ఇంకా తనలో ఉందని, మిమ్మల్ని పరుగులు పెట్టించమంటావా అంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మంగళవారం రాత్రి పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ వారి విధులకు ఆటంకం కలిగించడం, వారిని హెచ్చరించడం లాంటివి చేయడంతో పలు సెక్షన్ల కింద ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News