Sunday, April 28, 2024

కులవృత్తుల వారు ఆర్థిక సాయానికి ఆన్‌లైన్ చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: బిసి కులవృత్తులు, చేతివృత్తులు వారు ఆర్థిక సాయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని, హార్డ్ కాఫీ సమర్పించవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చిందని అన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల లోపు ఉన్న వారు ఆర్థిక సహాయం పొందుటకు అర్హులని అన్నారు.కాగా కుటుంబంలోని ఒకరికి మాత్రమే ఈ ఆర్థిక సహయం వర్తిస్తుందని గత ఐదేండ్లలో ఏ ప్రభుత్వం శాఖ నుంచి లబ్దిపొందిన ఒకరికి మాత్రమే ఈ ప్రభుత్వం శాఖ నుంచి లబ్దిపొందిన అనర్హులరని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల20లోగా tsobmms.cgg.gov.in వెబ్ సైట్ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తూ కుల, ఆదాయ, ధృవీకరణపత్రాలు, ఆధార్ కార్డు , రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. తిరిగి బౌతికంగా ఈ జిరాక్స్ ప్రతులు విధిగా మండల పరిషత్ అభివృద్ధ్ది అధికారి లేదా మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించవలసిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News