Friday, April 26, 2024

ఆన్‌లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సిబిఐ చర్యలు

- Advertisement -
- Advertisement -

CBI action on Online child porne

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సిబిఐ చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ వేదికగా చిన్నారులను కొందరు లైంగికంగా వేధిస్తున్నట్టు సిబిఐ గుర్తించింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై నవంబర్ 14న 23 కేసులు నమోదయ్యాయి. చైల్డ్‌పోర్న్ వీడియోలను సర్కులేట్ చేస్తున్న 83 మంది అనుమానితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిపై కఠిన చర్రయలకు సిబిఐ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు వీడియోలను కూడా సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News