Tuesday, May 21, 2024

హైకోర్టు న్యాయవాదికి సిబిఐ నోటీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సామజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసులో హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధికి సిబిసోమవారం నోటీసులు పంపించింది. సామజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసులో ఈ నెల 9న సిబిఐ ఎదుట హాజరుకావాలని గోపాలకృష్ణ కళానిధికి పంపిన నోటీసులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం సిజెఐ బాబ్డేపై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషన్ కోర్టు దిక్కరణ చర్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా, కరోనా సమయంలో సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులపై కళానిధి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను దూషించడం, ఆ దూషణలు పబ్లిక్ డొమైన్లలో పెట్టడం కోర్టు ధిక్కరణ చర్యలని, దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధిని తెలంగాణ హైకోర్టు అక్టోబర్‌లో ఆదేశించింది. ఈక్రమంలో ఆ మరుసటి రోజు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో కళానిధి బహిరంగ క్షమాపణ తెలిపినప్పటికీ తాజాగా సిబిఐ నుంచి నోటీసులు రావడం చర్చనీయాంశమైంది.

CBI gives notice to HC Advocate Gopalakrishna Kalanidhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News