మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజె క్టు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుం ది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సిబిఐ అధి కారులు గురువారం ప్రాథమిక విచారణ ప్రారం భించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సిబిఐ అధికారులు గురువారం ప్రాథమిక పరిశీలన చేసినట్టు అధికారవర్గాల సమాచారం. ఎన్‌డిఎస్‌ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) నివేది క ఆధారంగా సిబిఐ అధికారులు ప్రాథమిక ద ర్యాప్తు చేస్తున్నారు. సిబిఐ విచారణలో భాగంగా మాజీ సిఎం కెసిఆర్‌తో పాటు గత బీఆర్‌ఎస్ ప్ర భుత్వంలో ఇరిగేషన్, ఫైనాన్స్ మంత్రులుగా పని చేసిన తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ను సిబిఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నా యి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళే శ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని రాష్ట్ర ప్రభు త్వం తీవ్రంగా పరిగణించింది.
Also Read: బాలికను తుపాకీతో కాల్చి… ప్రేమోన్మాది ఆత్మహత్య
ఈ క్రమం లో ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను సిబిఐ సేకరిస్తోంది. కేసుకు విచారణ అర్హత ఉందో, లేదో తేల్చేందుకు సిబిఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో సిబిఐ విచారణ ప్రారంభించడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే దీనిపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ కమిషన్ దీనిపై సమగ్ర విచారణకు సిబిఐకి కానీ, సిబిసిఐడిని కానీ అప్పగించాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ నిర్ణయాలే కారణమని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కాళేశ్వరం కమిషన్ ఎదుట చెప్పిన విషయం తెలిసిందే.