Tuesday, April 30, 2024

కర్నూలు లో ఉత్కంఠ..

- Advertisement -
- Advertisement -

కర్నూల్: కర్నూలు లో ఇవాళ వేకువజాము నుంచే ఉత్కంర వాతావరణం కొనసాగుతుంది. కడప ఎంపి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడం కోసం సిబిఐ అధికారులు కర్నూలు వెళ్లారు. రెండు వాహనాల్లో ఆరుగురు సిబిఐ అధికారులు కర్నూలు వెళ్లారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ను అడ్డుకోవడానికి వైసిపి కార్యకర్తలు,అనుచరులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలి వచ్చారు. దీంతో శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు ,సిబిఐ అధికారుల తో చర్చలు జరుపుతున్నారు. తల్లి అనారోగ్య కారణంగా విచారణకు హజరు కాలేనని నిన్న సిబిఐ కి అవినాష్ రెడ్డి లేఖ రాశారు.

తన తల్లి కోలుకోడానికి ఇంకా 7 రోజులు పట్టోంచ్చు అంటూ లేఖలో పేర్కొన్నాడు. అవినాష్ రెడ్డి లొంగిపోవాల్సిందిగా ఎస్పిని సిబిఐ అధికారులు అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాసేపట్లో విశ్వ భారతి ఆసుపత్రికి సిబిఐ అధికారులు చేరుకొనున్నారు. దీంతో విశ్వ భారతి ఆసుపత్రికి వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలలు విధించారు. విశ్వ భారతి ఆసుపత్రి పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News