Monday, May 13, 2024

ఘనంగా మహిళ సంక్షేమ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం సంబరాలను లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్‌లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా లోకం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఐ.సి.డి.యస్ ఉద్యోగ మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంరక్షణ కొరకు గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న న్యూట్రిషన్ కిట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళా సంఘాలు చీరలు, వివిధ రకాల ఆహార ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, ఐసిడియస్ ఉద్యోగ మహిళలు మిల్లెట్లతో తయారుచేసిన కేకును కట్ చేసి మహిళా సంక్షేమం దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఉత్తమ మహిళ ఉద్యోగులను, మహిళ ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి, స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని దశాబ్ది కాలంలో సుపరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా సంక్షేమానికి కొండంత భరోసాను కల్పించిందన్నారు.

అమ్మాయి పుట్టగానే కేసీఆర్ కిట్ పథకంతో మొదలుకొని పెండ్లికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఐదు మండలాల అంగన్వాడి సిబ్బంది వివిధ శాఖలకు చెందిన మహిళలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News