Friday, April 26, 2024

ఎంపీలాడ్స్‌ను పునరుద్ధరించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Center revived MPLADS of Members of Parliament

రూ. 2 కోట్ల చొప్పున ఎంపీలకు నిధుల కేటాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్(ఎంపిలాడ్స్)ను కేంద్రం పునరుద్ధరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో మిగిలిన భాగానికి సంబంధించి ఎంపీలకు రూ. 2 కోట్లు చొప్పున ఒకే వాయిదాలో విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. అంతేగాక&2022-23 నుంచి 2025-26 వరకు ఎంపీలాడ్స్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని, ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున ఎంపీలకు కేటాయింపులు జరుగుతాయని కేంద్ర గణాంకాల శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22 పే,ంఇ 2025-26 వరకు ఇందుకోసం రూ. 17,417 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. 2014 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ంఎంపీలాడ్స్ కింద చేపట్టిన పనులను ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 2021లో దేశవ్యాప్తంగా 216 జిల్లాలలో మదింపు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ ఏజెన్సీ తన నివేదికను ఈ ఏడాది మార్చి 31న అందచేసిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News