Friday, April 26, 2024

కాలం చెల్లిన వాహనాలపై కేంద్రం దృష్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలపై కేంద్రం దృష్టిసారించింది. పదిహేను సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా మార్చుకోవాలి. వాటిని మార్చుకోకపోతే ఆ వాహనాల రిజిస్ట్రేషన్లను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ట్రాన్స్‌ఫోర్ట్, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. వాహనం రిజిస్ట్రేషన్15 ఏళ్లు పూర్తయిన వాహనాలను చట్టప్రకారం రిజిస్ట్రరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. 2021, -22 బడ్జెట్లో పేర్కొన్న ఈ విధానం మేరకు వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తరువాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తరువాత సామర్థ్య పరీక్షలు తప్పనిసరి కాగా చాలా వాహనాలు ఆ దిశగా ప్రయత్నం జరగడం లేదని కేంద్రం గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News