Saturday, April 27, 2024

ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని సారధ్యంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ ద్వారానే జరుగుతుంది. ప్రధాని నాయకత్వపు ఈ త్రి సభ్య కమిటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. సంబంధిత త్రిసభ్య కమిటీని రాజ్యసభలో ప్రవేశపెట్టే అజెండాలో చేర్చారు. ఇప్పటివరకూ ఇటువంటి ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యులుగా ఉండాలి. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారుల నియామక ప్రక్రియను సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనికి విరుద్ధంగా ఇప్పుడు సిజెఐ ప్రసక్తే లేకుండా ఈ త్రిసభ్య కమిటీని ఏర్పా టు చేసే బిల్లును తీసుకువచ్చారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దశలో సిఇసి, ఇసిల ఎంపిక నియామకాల ప్రక్రియకు ప్రాధాన్య త ఉంటుంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వతేదీన ఇప్పటి ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీకాలం ముగుస్తుంది. ఆయన 65వ ఏండ్ల వయస్సుకు రానుండటంతో ఇసి పదవికి ఖాళీ ఏర్పడుతుంది.

సాధారణంగా ఇంతకు ముందు రెండుసార్లు పార్లమెంటరీ ఎన్నికల తేదీల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం మార్చి లో వెలువరించడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇసి రిటైర్మెంట్ ఈ దశకు కొద్దిరోజుల ముందే చోటుచేసుకుంటుంది. ఎన్నికల సంఘానికి కీలక పదవుల ఎంపిక, ఖాళీ ల భర్తీ సంబంధించి ఎక్సిక్యూటివ్ జోక్యం ఉండకుండా చేసేలా సుప్రీంకోర్టు మార్చిలో ఈ తీర్పు వెలువరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధా ని, ప్రతిపక్ష నేత, సిజెఐతో కూడిన ప్యానెల్ ద్వారానే వీరి నియామకాలు జరగాల్సి ఉంది. ఈ కమిటీ ప్రతిపాదనలు, సిఫార్సుల మేరకు దేశ రాష్ట్రపతి ద్వా రా నియామక ప్రక్రియ జరగాలని ఇందులో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో సంబంధిత విషయంపై ఓ చట్టం తీసుకువచ్చే వరకూ ఇప్పుడున్న పద్ధతి కొనసాగించాల్సి ఉందని, ఇదే ఆరోగ్యకరమైన విధానం అవుతుందని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ సారధ్యపు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో స్పష్టం చే సింది. అయితే సుప్రీంకోర్టు రూలింగ్‌కు ముందు సిఇసి, ఇసిల నియామకం అంతా కూడా ప్రభుత్వం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్వారా జరిగేది.

రాజ్యాంగ ధర్మాసనం తీర్పును బేఖాతరా
కాంగ్రెస్, ఆప్ సహా పలు విపక్షాల నిరసన
సిజెఐ ప్రసక్తి లేకుండా ఎన్నికల సంఘంలో నియామకాలపై బిల్లు పట్ల కాం గ్రెస్, ఆప్ ఇతర ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు తీసుకురావడం ఆనవాయితీగా మారిందని, అంతేకాకుండా రాజ్యాంగ ధర్మాసనాల తీర్పును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని కాం గ్రెస్ గురువారం నిరసన తెలిపింది. ఎన్నికల సంఘాన్ని కూడా పూర్తిగా ప్రధాని చేతుల్లో కీలుబొమ్మ చేసేందుకు ఈ బిల్లు రూపొందించారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లోకి తీసుకువచ్చుకునేందుకు ప్రధాని చేపట్టిన ఆగడాలలో ఇది మరో ఉదాహరణ అని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కెసి వేణుగోపాల్ విమర్శించారు. సంబంధిత నియామకాలపై సుప్రీంకోర్టు ఇప్పటిరూలింగ్ గతి ఏమవుతుంది? ప్రధాని మోడీ పక్షపాత ధోరణి గల ఎన్నికల అధికారులను ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పటి బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, నిరంకుశం, అనుచితం అని తెలిపారు.

బిల్లును సభలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని, దీనికి బిజెడి, వైఎస్‌ఆర్‌సిపిలు మాతో పాటు కలిసివస్తాయా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ బిల్లును తీసుకురావడం ద్వారా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ఎన్నికల సంఘాన్ని తమ అదుపాజ్ఞలలోకి తీసుకురాదల్చినట్లు స్పష్టం అవుతోందని కాంగ్రెస్ ఎంపి, లోక్‌సభలో విప్ మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ప్రజాస్వామిక శక్తులు అన్ని కూడా ఈ బిల్లును ఘాటుగా వ్యతిరేకించాల్సి ఉందని, ఇంతవరకూ దాగుడుమూతల ధోరణితో ఉన్న కొన్ని విపక్షాలు కూడా ఈ బిల్లు విషయంలో సహకరిస్తాయా? అని ప్రశ్నించారు. సభలో లిస్టెడ్ జాబితాలో ఈబిల్లును పెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల (నియామక షరతులు పద్ధతులు, వారి సేవలు, కాలపరిమితి) బిల్లుగా దీనిని సిద్ధం చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం పనితీరు పద్ధతుల నిర్వహణ బాధ్యత కూడా ఈ త్రిసభ్య కమిటీనే చూసుకుంటుంది. విధివిధానాలను ఖరారు చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News