Sunday, April 28, 2024

‘కరోనా’ను విపత్తుగా ప్రకటించిన కేంద్రం..

- Advertisement -
- Advertisement -

Corona

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతుల కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్ డిఆర్ఎఫ్) ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరోనా మృతుల కుటుంబాలను కేంద్ర హోమంత్రిత్వ శాఖ రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఇండియాలోనూ రోజు రోజుకు మరింత వ్యాపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు దేశంలో 83 కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, ఈ వైరస్ సోకి ఇద్దరు మృతిచెందడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పమత్తమయ్యాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులను ప్రకటించాయి. ఇక, కరోనా ప్రభావంతో ఐపిఎల్ తోపాటు అంతర్జాతీయ క్రీడలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Central Govt to declares Coronavirus as disaster

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News