Wednesday, May 15, 2024

సెక్యూరిటీ గార్డు భార్యకు రూ. 50 లక్షలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో కరోనా మహమ్మారి సమయంలో విధులు నిర్వహిస్తూ సెక్యూరిటీ గార్డు మృతి చెందినందున అతని భార్యకు రూ. 50 లక్షలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ 19 వార్డు లేదా సెంటర్‌లో విధులు నిర్వర్తించే వ్యక్తులకు మాత్రమే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ బీమా పథకం వర్తిస్తుందని కేంద్రం సంకుచిత వైఖరిని తీసుకోరాదని హైకోర్టు సూచించింది. ఈ మేరకు జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తన తీర్పులో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆస్పత్రుల్లో జనం స్క్రీనింగ్ కోసం కిక్కిరిసి ఉన్నారని, ఆ సమయంలో ఈ సెక్యూరిటీ గార్డులు, పారామెడికల్ సిబ్బంది, తదితరులకు ఎలాంటి భద్రత ఆస్పత్రిలో లేకున్నా రోగులకు సరైన చికిత్స కేంద్రానికి పంపించే మార్గదర్శకం చేసేవారని జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ వివరించారు.

అందువల్ల వివిధ ప్రాంతాల్లో నియమింపబడిన సెక్యూరిటీ గార్డులకు కొవిడ్ రోగులతో నేరుగా సంబంధం లేదని చెప్పరాదని పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చిన కొవిడ్ రోగులు చాలా మంది సెక్యూరిటీ గార్డులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఎవరైనా సరే సన్నిహితంగా ఉంటుండే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సంకుచితమైన, వివాదాస్పద వైఖరిని తీసుకోవడాన్ని ఆమోదించలేమని , పిటిషనర్ అయిన సెక్యూరిటీ గార్డు భార్యకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ బీమా పథకాన్ని వర్తింప చేయాలని జస్టిస్ తన తీర్పులో ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకంతోపాటు ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ప్రకటించిన స్కీమ్ ప్రకారం ఎక్స్‌గ్రేషియా కూడా మంజూరు చేయాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణన లోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News