Saturday, May 11, 2024

ఏపిలో మూడు రోజుల పాటు సీఈవో పర్యటన

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ మూడు రోజులు పర్యటించనుంది. సోమవారం ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 9వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు, పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల అధికారితో సిఈసి సమీక్ష చేయనుంది. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత పై ఈనెల 10న ప్రజెంటేషన్ సిఈవో ఇవ్వన్నారు. తరువాత ఎన్నికల కమిషన్, కేంద్ర విభాగాలు, సిఎస్, డిజిపి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సిఈసి భేటీ కానున్నారు. అనంతరం సాయత్రం 4.30 గంటలకు సిఈసి, కమిషనర్ల మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ఎన్నికల బృందం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News