Tuesday, May 7, 2024

మతోన్మాదాన్ని ఎండగడుదాం: చాడ

- Advertisement -
- Advertisement -

మతోన్మాదాన్ని ఎండగడుదాం
అవినీతి అంతానికై పోరాటం సల్పించాలి:
యువతకు చాడ పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న అరాచక మతోన్మాదాన్ని ఎండగట్టాలని ,దీనికి యువత సన్నద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం గురువారం ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశానికి చాడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షత న నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మత ఛాందస విధానాలతో పాలన సాగుతోందని, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చ గొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్గించే చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న యువత మత ఉన్మాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు అన్నారు. అదే విధంగా అవినీతి అంతానికై పోరాటాలు సల్పించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి సాధనకై, అవినీతి అంతానికై, మతోన్మాదాన్ని నిర్మూలన కై సెప్టెంబర్ 4 న జరగనున్న సిపిఐ రాష్ట్ర 3వ మహాసభల బహిరంగ సభకు (శంషాబాద్) వేలాదిమంది యువత ను తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఎఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నెర్లకంటి శ్రీకాంత్, శంకర్, లింగం రవి, వెంకటేశ్వర్లు, యుగేందర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News