Friday, May 3, 2024

ఆర్‌టిసికి 4 మాసాల గడువు

- Advertisement -
- Advertisement -

 

Chairman Bajireddy review on TSRTC

ఆ లోగా బాగుపడకపోతే మనుగడ కష్టతరం

ప్రైవేట్ పరం వంటి ప్రత్యామ్నాయ చర్యలు
సిఎం హెచ్చరించినట్టు చైర్మన్ బాజిరెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఆర్‌టిసి సంస్థను కాపాడుకుందామని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.ఉద్యోగులంతా ఆర్‌టిసిని తమ సొంత సంస్థగా భావించి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. లేని పక్షంలో సంస్థ మనగుడ మరింత కష్టం తరం అవుతుందన్నారు. మరో నాలుగైదు మాసాల్లో సంస్థ లాభాల బాట పట్టలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించే అవకాశముందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.

సంస్థ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులతో బుధవారం బాజిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు కల్పిస్తున్న రవాణా రంగంలో ఆర్‌టిసిదే అగ్రస్థానమన్నారు. కాని దురదృష్టవశాత్తు సంస్థకు కొన్నేళ్లుగా నష్టాలు చవిచూస్తోందన్నారు. దీనికి తోడు డీజిల్ ధరల రేట్లు, బస్సు విడిభాగాల ధరలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా, లాక్‌డౌన్, సంస్థ ఉద్యోగుల సమ్మె… వంటి కారణాలు ప్రస్తుతం ఆర్‌టిసిని కోలుకోను విధంగా నష్టాల్లోకి తీసుకొని వెళ్లిందని చైర్మన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆర్‌టిసికి రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి ఆదుకోవడం కూడా సాధ్యం కాదన్నారు. ఆర్‌టిసి నష్టాల బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల క్రితం ఆర్‌టిసిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నప్పటికీ ఎందుకు గాడిన పడడం లేదని ఉన్నతాధికారులను సిఎం కెసిఆర్ ప్రశ్నించారన్నారు. సంస్థ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక తప్పదని సిఎం హెచ్చరించారని బాజిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థ సంస్థ మనుగడ పూర్తిగా మన చేతుల్లోనే ఉందని బాజిరెడ్డి అన్నారు. ఈ పరిస్థితిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుందామన్నారు. దీని కోసం అహర్నిశలు శ్రమిద్ధామన్నారు. సంస్థకు చెందిన ఉన్నతాధికారులతో త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించి నష్టాలపై కూలంకషంగా చర్చించనున్నామన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే సంస్థకు లాభాలు చేకురుతాయనే అంశంపై లోతుగా సమీక్ష చేస్తామన్నారు.

ప్రవేటు పరం తప్పదా!

మరో నాలుగు నాలుగైదు మాసాల్లో ఆర్‌టిసి గాడన పడని పక్షంలో ప్రైవేటు పరం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆర్‌టిసిని ఆదుకునేందుకు ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వం కేటాయించిన మూడ వేల కోట్ల రూపాయల్లో పదిహేను వందల కోట్లను ప్రణాళిక కింద, మరో పదిహేను వందల కోట్లను ప్రణాళికేతక నిధులను కేటాయించింది. అయితే కరోనా కారణంగా సంస్థపై ఇప్పటికే రూ.2500 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ప్రతి రోజుకు సంస్థకు పది కోట్ల ఆదాయం వస్తుంటే… వ్యయం మాత్రం పద్దెనిమిది కోట్లలో ఉంటున్నది. వస్తున్న ఆదాయానికి…అవుతున్న వ్యయానికి మధ్య చాలా వ్యత్యాసం నెలకొంది. దీంతో రోజు ఆర్‌టిసికి పెద్దఎత్తున నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాలను పూడ్చుకునేందుకు బస్సు టిక్కెట్ల రేట్లు పెంచాలని సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్‌కు సంస్థ అధికారులు విన్నవించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సమావేశంలో సంబంధిత అధికారులపై సిఎం కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అధికారులు ఎంతసేపు కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తే కుదరదని వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకోవాలని అప్పుడే సంస్థ బాగుపడుతుందని సిఎం ఉద్భోద చేశారు. దీనిపై సిఎం కెసిఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం డీజీల్‌పై లీటరుకు రూ.22 రూపాయలు పెరగటం వల్ల సంస్థపై రూ.550 కోట్లు అదనపు ఆర్థిక భారం పడుతోంది. దీంతో పాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతుంది. మొత్తంగా సాలీనా రూ. 600 కోట్ల ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తోంది. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో మొత్తం రూ. 3 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని సంస్థ యాజమాన్యం ఇటీవల అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థను ప్రైవేటుపరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News