Wednesday, May 22, 2024

జార్ఖండ్ లో ఉత్కంఠకు తెర.. బలపరీక్షలో నెగ్గిన చంపై సోరెన్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

రాంచీ: జార్ఖండ్ లో ఎట్టకేలకు రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి. దీంతో చంపై సోరెన్ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి. మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది.ఈ క్రమంలో సిఎంగా చంపాయ్ సోరెన్ బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నేపథ్యంలో అధికార కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ రిసార్ట్‌కు తరలించిన సంగతి తెలిసిందే. 81 మంది సభ్యుల అసెంబ్లీలో బలనిరూపణకు అవసరం అయిన సంఖ్యాబలం జెఎంఎం కూటమి(జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడి, సిపిఐ)కి ఉంది.

మొత్తం ఎమ్మెల్యేలు 81 కాగా ఇందులో ఒక్కస్థానం ఖాళీగా ఉంది. బలనిర్థారణకు అవసరం అయిన సంఖ్యాబలం 41. ఈ దశలో మెజార్టీ మార్క్‌కు మించి ఈ కూటమికి ఐదుగురు ఎమ్మెల్యేల బలం ఉంది. బిజెపి మిత్రపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. దీంతో విశ్వాస పరీక్షలో నెగ్గిన అధికార కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News